కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మార్కిస్టు)

Suomi فارسی Українська Svenska हिन्दी 日本語 Nynorsk Español English Română 한국어 Português Français 中文 Polski Русский العربية Nederlands Čeština Deutsch Italiano Català Türkçe

కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) కలకత్తాలో అక్టోబరు 31 నుండి 1964 నవంబరు 7 వరకు జరిగిన కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా యొక్క ఏడవ కాంగ్రెస్‌లో ఏర్పడింది కమ్యూనిస్ట్ పార్టీ అఫ్ ఇండియా (సిపిఐ)1960 లలో, కేరళ అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ నేతృత్వంలోని సంకీర్ణ చేతిలో ఓడిపోయింది. 1950 లలో రష్యా, చైనా కమ్యూనిస్టుల మధ్య చీలిక రావడం, భారతదేశం - చైనా మధ్య 1962 సరిహద్దు ఘర్షణ ఏర్పడిన సిద్ధాంత భేదాలు పార్టీ సభ్యుల మధ్య రావడం ప్రారంభించాయి . దీనితో కమ్యూనిస్ట్ పార్టీ అఫ్ ఇండియా ( సిపిఐ) తో విడిపోయి కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) ( సిపిఐ (ఎం)) ను ఏర్పాటు చేయడం జరిగింది . కమ్యూనిస్టుల చీలిక కమ్యూనిస్ట్ పార్టీ అఫ్ ఇండియా ( సిపిఐ) ని జాతీయ స్థాయిలో గణనీయంగా బలహీనపరిచింది మార్క్సిజం-లెనినిజం యొక్క శాస్త్రీయ, విప్లవాత్మక సిద్ధాంతాలను భారత రాజకీయాలలో కలుపుకొని,జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో కమ్యూనిస్ట్ ఉద్యమంలో ఒక స్థానము నిలబెట్టడానికి సిపిఐ (ఎం) ఆవిర్భవించినది . 1920 లో స్థాపించబడిన సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాటం, అవిభక్త కమ్యూనిస్ట్ పార్టీ యొక్క విప్లవాత్మక వారసత్వాన్ని కలయికతో ఏర్పడినది. సిపిఐ (ఎం) 1964 లో ఏర్పడినప్పటి సమయంలో 118,683 గా ఉన్న పార్టీ సభ్యత్వం 2014 లో 10,48,678 కు పెరిగింది. మార్క్సిజం-లెనినిజానికి స్వతంత్రంగా వర్తింపజేయడానికి పార్టీ ప్రయత్నించింది. భారతీయ పరిస్థితులు, ప్రజల ప్రజాస్వామ్య విప్లవం కోసం వ్యూహాలను రూపొందించడం, సామ్రాజ్యవాద, పెట్టుబడి విధానాలలో ( బూర్జువా), భూస్వామి దోపిడీని అంతం చేసే కార్యక్రమాన్ని చేపట్టడం ద్వారా ఈ ప్రాథమిక పరివర్తనను తీసుకురావడంలో నిమగ్నమై ఉంది. ప్రముఖ వామపక్ష పార్టీగా సిపిఐ (ఎం) వామపక్ష, ప్రజాస్వామ్య ఫ్రంట్‌ను ఏర్పాటు చేయడములో తనదయిన కర్తవ్యం నిర్వహించి, రాజకీయాలలో మార్పులకు చేయుత నిచ్చింది. పశ్చిమ బెంగాల్‌లో సిపిఐ (ఎం) అనుసరించిన "భారతదేశ సమాజానికి మార్క్సిజాన్ని సృజనాత్మకంగా అన్వయించింది", పార్టీ మనుగడను, ఆర్థిక, అభివృద్ధి విధానాలతో కేరళ, పశ్చిమ బెంగాలలో పరిపాలన చేసారు

Wikipedia



Impressum