కదిరి

हिन्दी 中文 Español English Tiếng Việt Bahasa Melayu Svenska Italiano

కదిరి, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని అనంతపురం జిల్లాలోని ఒక ముఖ్య పట్టణం, అదే జిల్లాకు చెందిన ఒక మండలం. పిన్ కోడ్ నం. 515591. యస్. టీ. డీ. కోడ్ నం.08494. ఆంధ్రప్రదేశ్ లో తాలూకాల వ్యవస్థ ఉన్నప్పుడు కదిరి తాలూకా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని అతి పెద్ద తాలూకాగా ఉండేది. కదిరి మల్లెపూలకు, కనకాంబరాలు (కుంకుమ పూలు) కు ప్రసిద్ధిగాంచిది. కదిరి కుంకుమ అంధ్ర, కర్ణాటకలో విరివిగా అమ్మబడుతుంది. కదిరి అనగానే సరిహద్దులో ఉన్న జిల్లాల ప్రజలకు, పొరుగున ఉన్న కర్నాటక ప్రజలకు గుర్తుకువచ్చేది ఇక్కడి ప్రసిద్ధి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానము.

WikipediaImpressum