మల్కనగిరి

Tiếng Việt Bahasa Melayu Ελληνικά हिन्दी English Русский Français 中文 Svenska Nederlands Deutsch Italiano

మల్కనగిరి ఒడిషా రాష్ట్రంలోని మల్కనగిరి జిల్లాలో ఒక పట్టణం. ఇది మల్కనగిరి జిల్లాకు ప్రధాన కేంద్రం. చారిత్రికంగా దీన్ని 'మాలిక్‌మర్ధనగిరి' అని పిలుస్తారు. దండకారణ్య ప్రాజెక్ట్ కింద 1965 నుండి పునరావాసం పొందిన తూర్పు పాకిస్తాన్ శరణార్థుల (ప్రస్తుత బంగ్లాదేశ్) కొత్త నివాసం మల్కనగిరి. అలాగే 1990ల ప్రారంభంలో LTTE సాయుధ పోరాటం తర్వాత కొంతమంది శ్రీలంక తమిళ శరణార్థులు మల్కనగిరి పట్టణంలో పునరావాసం పొందారు (వారిలో రెండు కుటుంబాలు మినహా మిగతావాళ్ళు తిరిగి వెళ్ళిపోయారు). ప్రస్తుతం ఇది రాష్ట్రంలో అత్యంత నక్సలైట్ ప్రభావిత ప్రాంతాలలో ఒకటి, రెడ్ కారిడార్‌లో భాగం. పట్టణ పరిపాలనను పురపాలక సంఘం నిర్వహిస్తుంది.

WikipediaImpressum