మృత సముద్రము

Suomi فارسی Tiếng Việt Galego Magyar Nederlands 한국어 Slovenščina Lietuvių Српски / Srpski Norsk (Bokmål) Bahasa Melayu Português Română Français Svenska Euskara Català 日本語 Nynorsk Español Slovenčina 中文 Dansk ไทย Čeština Deutsch Italiano Hrvatski Українська Ελληνικά हिन्दी English Русский Eesti Polski العربية Türkçe עברית

మృత సముద్రము
Wikipedia

మృత సముద్రం (హీబ్రూ: יָם הַ‏‏מֶ‏ּ‏לַ‏ח‎, Yām Ha-Melaḥ, "ఉప్పు సముద్రం";అరబ్బీ: البَحْر المَيّت‎, al-Baḥr l-Mayyit, "మృత సముద్రం") పశ్చిమాన ఇజ్రాయేల్ మరియు వెస్ట్ బ్యాంక్, తూర్పున జోర్డాన్ దేశాల మధ్యన గల ఉప్పునీటి సరస్సు. ఇది సముద్రమట్టానికి 420 మీటర్ల దిగువన ఉన్నది మరియు దీని అంచులు భూతలంపై ఉన్న పొడిభూమిలన్నింటికంటే దిగువన ఉన్న ప్రాంతం. మృత సముద్రం 380 మీటర్ల లోతున, ప్రపంచంలో అత్యంత లోతైన ఉప్పునీటి సరస్సు. అంతేకాక 33.7% శాతం లవణీయతతో ప్రపంచంలోనే అత్యంత ఉప్పగా ఉండే జలాశయాలలో ఒకటి. అస్సల్ సరస్సు (జిబూబీ), గరబొగజ్కోల్ మరియు అంటార్కిటికాలోని మెక్‌ముర్డో పొడి లోయలలోని లవణీయత ఎక్కువైన డాన్ హువాన్ కుంట వంటి కొన్ని సరస్సులు మాత్రమే మృతసముద్రాని కంటే ఉప్పగా ఉన్నాయి. అత్యంత లవణీయత కలిగిన సరస్సు, వాండా సరస్సు సముద్రం కంటే 8.6 రెట్లు అధిక లవణీయత కలిగి ఉంది. మృత సముద్రం, మధ్యధరా సముద్రం కంటే పది రెట్లు ఉప్పగా ఉన్నదని నిపుణుల అంచనా (34% శాతంతో మధ్యధరా సముద్రం యొక్క 3.5% శాతంతో పోల్చినపుడు). ఈ లవణీయత వలన మృతసముద్రం జంతుజాలం యొక్క మనుగడకు అత్యంత కఠోరమైన ఆవరణంగా ఉంది. మృత సముద్రం 67 కిలోమీటర్ల పొడవు, అత్యంత వెడల్పైన ప్రదేశంలో 18 కిలోమీటర్ల వెడల్పు మేరకు విస్తరించి ఉంది. ఇది జోర్డాన్ రిఫ్ట్ లోయలో ఏర్పడినది. దీని ప్రధాన నీటివనరు జోర్డాన్ నది.




Impressum