యానాం

Tiếng Việt Bahasa Melayu हिन्दी Español English Русский 한국어 Français 中文 Norsk (Bokmål) Polski Svenska Nederlands Deutsch Italiano

యానాం
Wikipedia

యానాం, పాండిచ్చేరి కేంద్రపాలిత ప్రాంతంలోని ఒక భాగం. ఇది ఆంధ్ర ప్రదేశ్ లోని తూర్పు గోదావరి జిల్లా హద్దుగా 30 చ.కి.మీ.ల విస్తీర్ణంలో ఉంది. ఇక్కడ నివసించే 32,000 జనాభాలో, చాలామంది తెలుగు మాట్లాడతారు. 1954 లో ఫ్రాన్స్ నుండి భారతదేశానికి ఇవ్వబడినా ఫ్రెంచి యానామ్ గా గుర్తింపు ఉంది. దీనికి 300 సంవత్సరాల చరిత్ర ఉంది. ఫ్రెంచి, తెలుగు సంస్కృతుల మేళవింపు యానాంలో కనిపిస్తుంది. ఫ్రెంచి పరిపాలనలో, యానాం ప్రజల పండగ రోజులలో జనవరి మాసంలో మంగళవారం జరిగే సంతలో దిగుమతి అయిన విదేశీ సరకు కొనటానికి తెలుగు వారు యానాం వెళ్లేవారు. ఇంతకు ముందు కళ్యాణపురం అనేవారు. ఎందుకంటే బ్రిటీషు వారు 1929 లో శారదా చట్టం ద్వారా బాల్యవివాహాలు నిషేధించిన తర్వాత, ఇక్కడ ఆ పెళ్ళిల్లు జరిగేవి.1995-2005 అభివృద్ధి నివేదికల ప్రకారం, పాండిచ్చేరిలో ఉత్తమ నియోజకవర్గంగా గుర్తించబడింది. కొత్త పథకాలకు ప్రయోగాత్మక కేంద్రంగా వుండేది.




Impressum