中文 Polski Lietuvių English Svenska
భారతదేశంలోని కర్నాటక, కేరళ రాష్ట్రాలలో తుళు భాష మాట్లాడే ప్రాంతాన్ని తుళునాడుగా వ్యవహరిస్తారు. దీనిలో కర్నాటకలోని దక్షిణ కన్నడ, ఉడిపి జిల్లాలూ కేరళలోని కాసరగోడు జిల్లాలో పాయాశ్విని నది వరకూ ఉన్న ప్రాంతాలు ఉన్నాయి. మంగళూరు, ఉడిపి, కాసరగోడు ఈ ప్రాంతాలలోని పెద్ద ఊర్లు.