మైలాదుత్తురై

हिन्दी 中文 Tiếng Việt Deutsch English Bahasa Melayu Svenska Italiano

మైలాదుత్తురై
Wikipedia

మైలాదుత్తురై, (గతంలో మాయవరం లేదా మయూరం అని పిలుస్తారు) భారతదేశం, తమిళనాడు రాష్ట్రం, మైలాదుత్తురై జిల్లాకు చెందిన ఒక పట్టణం.ఇది మైలాదుత్తురై జిల్లాకు ప్రధాన కేంద్రం. ఈ పట్టణం రాష్ట్ర రాజధాని చెన్నై నుండి 281 కిమీ (175 మై) దూరంలో ఉంది. మైలాదుత్తురై ప్రాంతాన్ని మధ్యయుగ చోళులు పరిపాలించారు. తరువాత విజయనగర సామ్రాజ్యం, తంజావూరు నాయకులు, తంజావూరు మరాఠాలు, చివరిగా బ్రిటీష్ సామ్రాజ్యంతో సహా వివిధ రాజవంశాలచే పాలించబడింది. 1947లో భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చే వరకు మైలదుతరై పూర్వపు తంజావూరు జిల్లాలో భాగంగా ఉంది. 1991 వరకు తంజావూరు జిల్లా, ఆ తర్వాత కొత్తగా ఏర్పడిన నాగపట్టణం జిల్లాలో భాగంగా ఉంది. ఈ పట్టణం ప్రాంతం వ్యవసాయం, చేనేతకు ప్రసిద్ధి చెందింది. మైలాదుత్తురై తూర్పు తీరంలో ఉన్నందున, దాని ఆదాయాన్ని సంపాదించడంలో చేపల వేట కీలక పాత్ర పోషిస్తుంది.
Impressum