అగలి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములోని శ్రీ సత్యసాయి జిల్లా అగలి మండలం లోని గ్రామం. ఈ పేరుతో ఉన్న ఈ మండలానికి ఇది కేంద్రం. కర్ణాటక సరిహద్దు మండలమైన అగలిలో కన్నడ ప్రభావం ఎక్కువగా ఉంది. స్వాతంత్ర్యానికి పూర్వం అగలి మద్రాసు రాష్ట్రంలోని తుమకూరు జిల్లాలో భాగంగా ఉంది. ప్రస్తుతం ఇది అనంతపురం జిల్లాలోని మడకశిర తాలూకాలో భాగం. .సా.శ..748 (శక సంవత్సరం 669) లో గాంగ వంశపు రాజు శ్రీపురుషుని భార్య కంచికబ్బె అగలిని పాలించినట్లు శ్రీపురుషుని అగలి దానశాసనం వల్ల తెలుస్తుంది..