కోడుమూరు

English

కోడుమూరు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని కర్నూలు జిల్లా, కోడుమూరు మండలం లోని గ్రామం. పిన్ కోడ్ : 518 464. ఈ గ్రామంలోని పల్లెలాంబాదేవి ఆలయం ప్రసిద్ధిచెందినది. కోడుమూరు హంద్రీ నది ఒడ్డున బళ్ళారి-కర్నూలు రహదారిపై కర్నూలు నుండి 20 మైళ్ల దూరంలో ఉన్నది. కోడుమూరు చేనేత పరిశ్రమకు ప్రసిద్ధి చెందింది. ఇక్కడ గద్వాల శైలి చీరలను నేస్తారు. కోడుమూరు ప్రజలు ప్రతి సంవత్సరం ఫిబ్రవరి మొదటి వారం లేదా రెండవ వారంలో చౌడమ్మ జాతర జరుపుకుంటారు. తేరు బజారులో ఉన్న చౌడమ్మ గుడి నుండి ఉత్సవ రథం (తేరు)ను పురవీధుల్లోకి తీసుకు వెళతారు. కొత్తగా పెళ్ళైన వరులు తేరును లాగితే, వారి వైవాహిక జీవితం సుఖమయంగా సాగుతుందని భక్తుల నమ్మకం. ఈ సందర్భంగా అనేక సాంస్కృతిక కార్యక్రమాలు, కోడుమూరు యువజన సంఘం ఆధ్వర్యంలో ఆటల పోటీలను నిర్వహిస్తారు. ఏరువాక పౌర్ణమి రోజున కోడుమూరు ప్రజలు గాలిపటాల పండగ జరుపుకుంటారు. ఇక్కడ ఆరు అడుగులు పొడవైన గాలిపటాలను కూడా కనిపిస్తాయి. ఇవే కాకుండా వల్లెలమ్మ ఉత్సవాన్ని కూడా ప్రతి సంవత్సరం జరుపుకుంటారు.

WikipediaImpressum