పత్తికొండ

English

పత్తికొండ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోనికర్నూలు జిల్లా, పత్తికొండ మండలం లోని గ్రామం, ఈ మండలానికి కేంద్రం. పత్తికొండ, గుత్తి - ఆదోని మార్గంలో ఆస్పరి రైల్వే స్టేషను నుండి 12 మైళ్ల దూరంలో ఉంది. జిల్లా కేంద్రమైన కర్నూలు నుండి 50 మైళ్ళ దూరంలో ఉంది. పట్టణానికి పశ్చిమాన హంద్రీ నది ప్రవహిస్తుంది. ఇది సమీప పట్టణమైన ఆదోని నుండి 35 కి. మీ. దూరంలో ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 6138 ఇళ్లతో, 29342 జనాభాతో 4581 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 14428, ఆడవారి సంఖ్య 14914. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 3387 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 1360. గ్రామ జనగణన లొకేషన్ కోడ్ 594418.

Wikipedia



Impressum