దేవనకొండ

English

దేవనకొండ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని కర్నూలు జిల్లా, దేవనకొండ మండలం లోని గ్రామం. పిన్ కోడ్: 518 465. దేవనకోండ ప్రత్తికొండ నుండి 8 మైళ్ళ దూరంలో ఆగ్నేయాన ఉన్నది. పూర్యం ఇది పంచపాళ్యం తాలూకాలో భాగంగా ఉన్నది. ఇక్కడ కొండపై పాలేగార్లు నిర్మించిన రాతికోట శిధిలావస్థలో ఉన్నది. పాలేగార్ల కుటుంబం అంతరించిపోయింది. పాలేగారు రహ్మాన్ నాయక బీజాపూర్ ప్రభుత్వం ఆధీనంలో వంద మంది సేవకులను నిర్వహించేవారు. అయితే నాసిర్ జంగ్ పాలనాకాలంలో ఈయన కుమారుడు ఏవో అల్లర్లు సృష్టించగా బంధించి తీసుకొని వెళ్ళి సున్తీ చేసి మతం మార్చి పంపించారు. ఆ తరువాత తిరుగుబాటు చేయగా 1768 నుండి 1786 వరకు బందీగా ఉన్నాడు. ఈ ప్రాంతములో ఎక్కువగా మెట్ట భూములు విస్తరించి ఉన్నాయి కాబట్టి ఇక్కడ పూర్తిగా వర్షాధార వ్యవసాయం పైనే ప్రజలు ఆదారపడి జీవిస్తున్నారు. కొంత మంది సమీప కర్నూలు నగరంలో భవన నిర్మాణ రంగంలో ఉపాది పొందుతున్నారు మరి కొంత మంది చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తున్నారు. ఈ ఊరిలోని ప్రముఖ దేవాలయాలు :- 1) శివాలయం 2) అయ్యప్పస్వామి దేవాలయం 3) ఆంజనేయ స్వామి దేవాలయం 4) మల్లికార్జునస్వామి దేవాలయం 5) రామాలయం దేవన కొండ నందు ప్రతి సంవత్సరం దిగంబర దివానే (మూగి) తాత ఉరుసు మార్చి నెలలో ఘనంగా నిర్వహించబడుతుంది, ఈ సందర్భంగా జిల్లా స్థాయి వాలీ బాల్ క్రీడా పోటీలు నిర్వహించి గెలుపొందిన జట్లకు బహుమతులను అందజేస్తారు. ఈ ప్రాంతం చాలా కాలంగా దుర్బిక్ష పరిస్తితులను ఎదుర్కొంటోంది. భూగర్బ జలాలు తగ్గడము వల్ల 2011-2012 వ సంవత్సరములో వ్యవసాయ బోర్లలో చాలా వరకు నీరు రావడము లేదు దీంతో వ్యవసాయం పరిస్థితి అంత ఆశాజనకంగా లేదు, ఈ మధ్య కాలంలో ప్రభుత్వం చేపట్టిన హంద్రీనీవా పథకంపై ప్రజలు చాలా ఆశలు పెట్టుకున్నారు, అది పూర్తైతే భూగర్బ జలాలు మళ్ళీ పెరిగే అవకాశం ఉంది. ఇది సమీప పట్టణమైన యెమ్మిగనూరు నుండి 28 కి. మీ. దూరంలో ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 2132 ఇళ్లతో, 10493 జనాభాతో 1757 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 5351, ఆడవారి సంఖ్య 5142. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 1989 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 230. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 594200.పిన్ కోడ్: 518465.

WikipediaImpressum