వైరా, తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాకు చెందిన పట్టణం.ఇది వైరా మండలానికి ప్రధాన కేంద్రం. ఇది ఖమ్మం, కొత్తగూడెం, భద్రాచలం, మధిర, జగ్గయ్యపేట పట్టణాల రహదారులకు కూడలిగా ఉంది. కనుక చుట్టుప్రక్కల ప్రాంతాలకు కేంద్రంగా ఉంది. ఇది వైరా పురపాలకసంఘంగా ఏర్పడింది.