పెరంబూరు

English Português

పెరంబూరు భారతదేశంలోని తమిళనాడు రాష్ట్రం లోని మహానగరమైన ఉత్తరచెన్నై లోని ఒక ప్రముఖ ప్రదేశం. అన్ని అవసరాలని తీర్చగలిగిన అన్ని వసతులు కలిగి ఖరీదైన ప్రాంతం. ఈ ప్రదేశానికి ఈ పేరు రావడానికి కల సరి అయిన కారణం తెలియనప్పటికీ ఇక్కడ కొన్ని వందల సంవత్సరాల కింద హుజూర్ తోటల చుట్టూ వెదురు అడవులను పేచబడినట్లు భావిస్తున్నారు. ప్రస్తుతం ఆ ప్రదేశంలో సింప్సన్ ప్రైవేట్ లిమిటెడ్ గృహాలు ఉన్నాయి. తమిళ భాషలో పెరంబు అంటే వెదురు అలాగే ఊరు అంటే నగరం. చెన్నై సెంట్రల్ నుండి ఈ ప్రదేశం 4 కిలోమీటర్లు దూరంలో ఉంది. పెరంబూరు వాణిజ్య నివాస గృహాల మిశ్రితమైన ప్రాంతం. పెరంబూరులో మాధవరం రహదారి అత్యంత చురుకైనవాణిజ్య కేంద్రం. ఇది నగల దుకాణాలకు, ఔషధ దుకాణాలకు, నిత్యావసర దుకాణాలకు కేంద్రం. సమగ్ర రైలు పెట్టెల కర్మాగారము (ICF) ఈ ప్రాంతంలో కలదు.

WikipediaImpressum