కాలడి

हिन्दी English Svenska

కాలడి
Wikipedia

కాలడి (మళయాలం: കാലടി) కేరళ రాష్ట్రంలో పెరియార్ నది ఒడ్డున ఎర్నాకుళం జిల్లాలోని పల్లెటూరు. ఇక్కడే శ్రీ ఆది శంకరాచార్యుడు (Adi Sankara) జన్మించాడు. ఇదొక హిందూ పుణ్యక్షేత్రము. కేరళలో ఎర్నాకులం జిల్లా లోగురువాయూర్ కు 75కిలో మీటర్ల దూరం లో కాలడి గ్రామం ఉంది .ఇదే జగద్గురువులు శ్రీ ఆది శంకరాచార్యులు వారు జన్మించిన పవిత్ర క్షేత్రం .ఇక్కడి నుండే కాలి నడకన ఆసేతు హిమాచల పర్యంతం అనేక సార్లు తిరిగి నాలుగు ఆమ్నాయ పీఠాలు స్తాపించి ఆర్షధర్మాన్ని నిల బెట్టారు. వైదిక మతోద్ధారణ చేశారు .అద్వైత మత స్థాపనా చార్యులు గా కీర్తి శిఖరాన్ని అధిరోహించారు .పరమ విశిష్టమైన కాశ్మీర్ శారదా పీఠాన్ని సమర్ధత నిరూపించి శారదా మాత అంగీకారం తో అధిరోహించి జగద్గురువు లని పించుకొన్నారు .ఆ మహాను భావుడే లేక పోతే చైనా ,పాకిస్తాన్ సరిహద్దు లో ఉన్న భారత దేశ ప్రజలు ధర్మానికి దూరమై పోయి ఉండేవారు ఎర్నాకులం జిల్లాలో పెరియార్ నదికి తూర్పున ఉంది కాలడి గ్రామం .ఈ గ్రామాన్ని గుర్తు పట్టటం మొదట పెద్ద సమస్య గా మారింది. అప్పుడు శృంగేరి పీఠం వారు మహా పండితుడు చారిత్రిక పరిశోధకుడుశంకరుల జీవితం పై అధారిటీ అయిన శ్రీ నడుకావేరి శ్రీనివాస శాస్త్రి గారిని కాలడికి పంపారు .అసలు ఆది శంకరుల జన్మ స్థలాన్ని అన్ని ఆధారాలతో తేల్చమనిపంపారు . ఆయన ఇక్కడికి వచ్చి పరిశీలనా ,పరిశోధనా చేసి కైఫీయత్తులను తిరగేసి ఇప్పుడు శ్రీ శంకరులదేవాలయం కట్టబడిన ప్రదేశమే అసలైన ఆది శంకరుల జన్మ క్షేత్రం అని నిర్ధారించి రుజువులతో సహా తెలియ జేశారు .అప్పుడు ఈ ప్రదేశం అంతా ‘’కపిల్లి మన ‘’అనే ఆయన స్వాధీనం లో ఉండేది .ఈ విషయాన్ని శృంగేరి వారు తిరువాన్కూర్ మహా రాజా వారికి తెలియ జేశారు ఆ స్థలాన్ని తమకు ఇస్తే అక్కడ శంకర ఆలయం నిర్మించి స్మ్రుతి చిహ్నం గా తీర్చి దిద్దుతామని చెప్పారు .మహా రాజు మహాదానందం పొంది’’ కపిల్ల మ’న’’ నుంచి 1906లో ఈ ప్రాంతాన్ని స్వాధీన పరచుకి శృంగేరి పీఠానికి అప్పగించాడు . శృంగేరి మఠం ఇక్కడ 1910లో శ్రీ ఆది శంకరుల ఆలయాన్ని నిర్మించింది .అదే కాలడి ఆవిర్భావ సంవత్సరం గా భావించారు .సరిగ్గా వంద ఏళ్ళకు 2010లో కాలడి శత వత్సర ఉత్సవాలను పీఠం ఘనం గా నిర్వ హించింది ఒక డాక్యుమెంటరీ చిత్రాన్ని పీఠం నిర్మించి ప్రచారం లోకి తెచ్చింది .లేక పోతే కాలడి అలాగే చరిత్ర గర్భం లో కలిసి పోయి ఉండేదేమో ?




Impressum