సాలాసర్ బాలాజీ

English हिन्दी

సాలాసర్ బాలాజీ
Wikipedia

సాలాసర్ బాలాజీ (Salasar Balaji) అనేది ఒక పుణ్యక్షేత్రం, భక్తులు దీనిని భగవంతుడు హనుమాన్ కొలువైవున్న ఒక ధార్మిక ప్రదేశంగా గుర్తిస్తున్నారు. రాజస్థాన్ రాష్ట్రంలోని చురు జిల్లాలో ఈ ప్రదేశం ఉంది. సాలాసర్ ధామ్ ఏడాది పొడవునా అసంఖ్యాక భారతీయ భక్తులను ఆకర్షిస్తోంది. ఇక్కడ ప్రతి ఏడాది చైత్ర పూర్ణిమ మరియు అశ్వినీ పూర్ణిమ రోజుల్లో పెద్దఎత్తున వేడుకలు నిర్వహిస్తారు, ఈ వేడుకల సందర్భంగా దేవునికి జరిగే పూజల్లో 6 నుంచి 7 లక్షల మంది భక్తులు పాల్గొంటారు. ఆలయం మరియు ఆలయ సంబంధ వేడుకల నిర్వహణను హనుమాన్ సేవా సమితి పర్యవేక్షిస్తుంది. ఇక్కడ బస చేయడం కోసం అనేక ధర్మశాలలు మరియు ఆహారం కోసం అనేక ఫలహారశాలలు ఉన్నాయి. శ్రీ హనుమాన్ ఆలయం సాలాసర్ పట్టణం నడిబొడ్డున ఉంది.
Impressum