సూరత్

Suomi فارسی Tiếng Việt Galego Magyar Nederlands Српски / Srpski Norsk (Bokmål) Bahasa Melayu Português Română Français Svenska Euskara Català Lietuvių 日本語 Español 中文 Dansk ไทย Čeština Deutsch Italiano Ελληνικά हिन्दी English Русский 한국어 Eesti Polski العربية Українська Türkçe עברית

సూరత్
Wikipedia

సూరత్,పశ్చిమభారతదేశం,గుజరాత్ రాష్ట్రం,సూరత్ జిల్లా లోని ఒక నగరం.ఇది సూరత్ జిల్లా పరిపాలనా రాజధాని.సూరత్ అనేపదానికి గుజరాతీ, హిందీ భాషలలోముఖం అని అర్ధం.అరేబియాసముద్రంలో సంగమించే ప్రదేశానికి సమీపంలోతపతి నది ఒడ్డున ఉన్నఇది ఒకపెద్దఓడరేవుగా ఉండేది.ఇదిఇప్పుడు దక్షిణ గుజరాత్‌లోవాణిజ్య,ఆర్థికకేంద్రంగా ఉంది.ఇది పశ్చిమభారతదేశంలోని అతిపెద్ద పట్టణ ప్రాంతాలలోఒకటి.ఇది బాగా స్థిరపడిన వజ్రా,వస్త్ర పరిశ్రమలను కలిగి ఉంది. దుస్తులు,ఉపకరణాలకు ప్రధాన సరఫరా కేంద్రం.ప్రపంచంలోనివజ్రాల సరఫరాలోదాదాపు 90% నగరంలోఅవసరమైన రూపుప్రకారంకత్తిరించుట,మెరుగు దిద్దటం చేయబడతాయి. ఇదిఅహ్మదాబాద్ తర్వాత గుజరాత్‌లో రెండవ అతిపెద్ద నగరం. సూరత్ నగరం,భారతదేశంలో జనాభా ప్రకారం ఎనిమిదవ అతిపెద్ద నగరం ,తొమ్మిదవ అతిపెద్ద పట్టణ సముదాయం.ఈనగరం 284 కి.మీ. (176 మై.) లో విస్తరించి ఉంది.రాష్ట్రరాజధాని గాంధీనగర్‌కు దక్షిణాన 265 కి.మీ. (165 మై.) అహ్మదాబాద్‌కు దక్షిణాన 289 కి.మీ. (180 మై.) ముంబైకి ఉత్తరంగాఉంటుంది.నగరం కేంద్రం అరేబియా సముద్రానికి దగ్గరగా తపతి నదిపై ఉంది.[16]




Impressum