ఆలంపూర్ అసెంబ్లీ నియోజకవర్గం

English

అలంపూర్ శాసనసభ నియోజకవర్గం, జోగులాంబ గద్వాల జిల్లా లోని 2 శాసనసభ నియోజకవర్గాలలో ఒకటి .2007లో చేయబడిన నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ ప్రకారం ఈ నియోజకవర్గం పరిధిలో 5 మండలాలు ఉన్నాయి. ఈ నియోజకవర్గం ఎస్సీలకు రిజర్వ్ చేయబడింది. పునర్విభజన ఫలితంగా గతంలో ఈ నియోజకవర్గంలో భాగంగా ఉన్న పెబ్బేరు మండలం వనపర్తి నియోజకవర్గంలోకి వెళ్ళిపోగా, గద్వాల నియోజకవర్గం నుంచి కొత్తగా అయిజ మండలం వచ్చి చేరింది. ఈ నియోజకవర్గం నుంచి భారతీయ జనతా పార్టీకి చెందిన రావుల రవీంద్రనాథ్ రెడ్డి 3 సార్లు విజయం సాధించాడు.

WikipediaImpressum