అంగర

English

అంగర, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా, కపిలేశ్వరపురం మండలం లోని గ్రామం. ఇది మండల కేంద్రమైన కపిలేశ్వరపురం నుండి 4 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన మండపేట నుండి 15 కి. మీ. దూరంలోనూ ఉంది. ఇది కపిలేశ్వరపురం మండలంలోనే అభివృద్ధి చెందిన గ్రామం. ఈ గ్రామంలో పల్లెల్లోని ప్రకృతి రమణీయత, పట్టణ తరహా అభివృద్ధి రెండింటినీ చూడవచ్చు. ఇచట గల శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం ప్రసిద్ధి చెందింది. గ్రామంనకు సమీపంలో గౌతమి గోదావరి నది ఉంది. అంగర, పడమర ఖండ్రిక గ్రామాలు ప్రధాన రహదారిచే వేరుపరచబడినవి.

Wikipedia



Impressum