ఆదోని

فارسی Tiếng Việt Lietuvių Bahasa Melayu हिन्दी Português English 中文 Polski Svenska Deutsch Italiano Català

ఆదోని
Wikipedia

ఆదోని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లాకు చెందిన పట్టణం.కర్నూలు జిల్లాలో ఇది పెరుగుదల పట్టణం. ఇది ఆదోని పురపాలక సంఘం ప్రధాన కేంద్రంగా ఉంది.మండల ప్రధాన కేంద్రం. ఆదోని రైలుమార్గాన హైదరాబాదు నుండి 225 కి.మీ, మద్రాసు నుండి 494 కి.మీలు దూరంలో ఉంది. 2005 జనాభా అంచనా ప్రకారం పట్టణ జనాభా 1,64,000. రాష్ట్రంలోని అత్యంత పురాతమైన మున్సిపాలిటీలలో ఆదోని ఒకటి. ఆదోని ప్రజల కోరిక మేరకు 1865 మేలో మున్సిపాలిటీగా వ్యవస్థీకరించారు. మధ్యయుగంలో విజయనగర సామ్రాజ్యములో ముఖ్య పట్టణమైన ఆదవోని నేడు వస్త్ర పరిశ్రమలకు పేరుపొందింది. కొండపైన జీర్ణావస్థలో ఉన్న కోట దుర్గం ముస్లింల పాలనలో ప్రభుత్వ కేంద్రంగా ఉంది. 18వ శతాబ్దపు ఆంధ్రదేశపు యుద్ధాలలో తరచూ ఆదోని కోట ప్రస్తావన ఉంది.
Impressum