తూర్పు తైమూర్

Suomi فارسی Tiếng Việt Galego Magyar Nederlands Slovenščina Српски / Srpski Norsk (Bokmål) Bahasa Melayu Português Română Français Euskara Català Lietuvių Svenska 日本語 Nynorsk Español Slovenčina 中文 Dansk ไทย Čeština Deutsch Italiano Hrvatski Українська Ελληνικά हिन्दी English Русский 한국어 Eesti Polski العربية Türkçe עברית

తూర్పు తిమోర్ (/ˌiːst ˈtiːmɔːr/ ( listen)) లేక తిమోర్- లెస్టే (/tiˈmɔːr ˈlɛʃteɪ/), టేటం భాష: తిమోర్ లో రోసె అధికారికంగా డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ తిమోర్- లెస్తె (పోర్చుగీసు: " రిపబ్లిక డెమొక్రటిక డీ తైమొర్- లెస్తె " టటం: రిపబ్లిక డెమొక్రటిక డీ తైమొర్- లెస్) మేరీటైం ఈశాన్య ఆసియాలో సార్వభౌమాధికారం కలిగిన దేశం. ఇది తిమోర్ ద్వీపం పూర్వార్ధభూభాగంలో (ఈస్ట్ హాఫ్) ఉంది. దీనికి సమీపంలో అటౌరో ద్వీపం, ఒఎక్యూస్, జాకో ద్వీపం ఉన్నాయి. తిమోర్ వైశాల్యం 15,410 చ.కి.మీ. 16వ శతాబ్దంలో పోర్చుగీస్ తైమూరును తమకాలనీగా మార్చింది. 1975 వరకు ఇది రోర్చుగీస్ తిమోర్‌గా ఉంది. తరువాత తూర్పు తిమోర్ రివల్యూషనరీ ఫ్రంట్ తూర్పు తిమోర్‌ను స్వతంత్రభూభాగంగా ప్రకటించింది. తరువాత తొమ్మిది రోజులకు తూర్పు తిమోర్ మీద ఇండోనేషియా దండెత్తి తూర్పు తిమోర్ భూభాగాన్ని ఆక్రమించింది. తరువాత సంవత్సరం తూర్పు తిమోర్ ఇండోనేషన్ 27 వ భూభాగంగా ప్రకటించబడింది.

Wikipedia



Impressum