కాకినాడ

Suomi فارسی Tiếng Việt Lietuvių Bahasa Melayu हिन्दी Português Español English Русский Français 中文 Polski Deutsch Српски / Srpski Italiano Norsk (Bokmål) Català Svenska

కాకినాడ
Wikipedia

కాకినాడ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని తూర్పు గోదావరి జిల్లా యొక్క ముఖ్యపట్టణం. కాకినాడ తూర్పు గోదావరి జిల్లాలో ప్రధాన పట్టణమే కాక భారత దేశ తూర్పు తీర ప్రాంతములోముఖ్యమైన రేవు పట్టణం. డెన్మార్క్ నగరము మాదిరిగా వీధులు జిగ్ జాగ్ చేసినట్టు సమాంతరంగా ఉండి, కూడళ్ళలో ఒకదానికొకటి బంగారు రంగులో ఉండడం ఈ నగర ప్రత్యేకత. ప్రణాళికా బద్ధంగా ఉన్న కారణంగా కో-కెనడా గానూ, ప్రముఖమైన ఓడరేవుగా ఉన్న కారణం చేత రెండవ అనకాపల్లి గానూ, చమురు అన్వేషణ, వెలికితీత కార్యక్రమాలు అధికంగా ఉన్న కారణంచేత మినీ యిరాన్ గానూ, పిలుస్తూ ఉంటారు. ప్రశాంత వాతావరణానికి మారుపేరైన ఈ పట్టణం పెన్షనర్స్ పారడైస్గా పేరొందినది. ఆంధ్రప్రదేశ్ పెట్రోలియం రసాయనాలు పెట్రోరసాయనాల పెట్టుబడి ప్రాంతం పరిధి కాకినాడని ఆనుకొనే మొదలవుతుంది. ఈ మధ్యకాలంలో కె.జి బేసిన్ రాజధానిగా విదేశాలలో ప్రాముఖ్యతని సంతరించుకొంటోంది.




Impressum