ఆగుంబె (Agumbe) (కన్నడ:ಆಗುಂಬೆ) కర్ణాటక రాష్ట్రంలోని షిమోగ జిల్లా, తీర్థహళ్ళి తాలుకాలో ఒక గ్రామం. ఆగుంబె, పశ్చిమ కనుమలలో మలనాడు అనే ప్రాంతంలో ఉంది. ఈ గ్రామంలో పడే వర్ష పాతం ఆధారంగా భారత దేశంలో అత్యధిక వర్షపాతం పడే ప్రదేశమైన చిరపుంజి తరువాతి స్థానంలో నిలుస్తుంది. ఇంత అత్యధిక వర్షపాతం వల్ల ఆగుంబె, దక్షిణ చిరపుంజి అని పేరు సంపాదించుకొన్నది. ఈ గ్రామంలో ప్రసిద్ధ సర్ప పరిశోధనా శాస్త్రవేత్త విట్టేకర్ స్థాపించిన వర్షపాత ఆధారిత అరణ్య పరిశోధనా కేంద్రం ఉంది. విట్టేకర్ ఈ గ్రామాన్ని కింగ్ కోబ్రా రాజధానిగా వర్ణించాడు. ఔషధ మెక్కల సంరక్షణా కేంద్రం కూడా ఆగుంబే గ్రామంలోనే ఉంది.