ఇండోర్

Suomi فارسی Tiếng Việt Lietuvių Bahasa Melayu Svenska हिन्दी 日本語 Português Српски / Srpski Español English Română 한국어 Français 中文 Українська Polski Dansk Русский العربية Nederlands Čeština Magyar Deutsch Italiano Norsk (Bokmål) Català Türkçe עברית

ఇండోర్
Wikipedia

ఇండోర్, మధ్యప్రదేశ్‌లో అత్యధిక జనాభా కలిగిన అతిపెద్ద నగరం. ఇది ఇండోర్ జిల్లాకు ముఖ్యపట్టణం. ఇండోర్ డివిజనుకు ప్రధాన కార్యాలయం. ఇది విద్యా కేంద్రం కూడా. ప్రసిద్ధ విద్యాసంస్థలైన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ సంస్థలు రెండూ ఇక్కడ ఉన్నాయి. ఇండోర్ నగరం,మాళ్వా పీఠభూమికి దక్షిణపు టంచున, సముద్ర మట్టం నుండి 553 మీటర్ల ఎత్తున ఉంది. ఇది మధ్య భారతదేశంలోని ప్రధాన నగరాల్లోకెల్లా అత్యధిక ఎత్తున ఉన్న నగరం. ఇండోర్, రాష్ట్ర రాజధాని భోపాల్ కు పశ్చిమాన 190 కి.మీ. దూరంలో ఉంది. 2011 జనాభా లెక్కల ప్రకారం నగర జనాభా 19,94,397 ఇండోర్ పట్టణ సముదాయం జనాభా 21,70,295. నగరం 530 చ.కి.మీ. విస్తీర్ణంలో విస్తరించి ఉంది.




Impressum