పాలిటానా

Tiếng Việt Bahasa Melayu हिन्दी Español English Русский Français 中文 Magyar Deutsch Italiano Català

పాలిటానా
Wikipedia

పాలిటానా నగరం భారత దేశం లోని గుజరాత్లో గల "భావ్‌నగర్ జిల్లా" లోనిది. ఇది భావ్‌నగర్ పట్టణానికి నైరృతి దిక్కున ఉంది. ఇది జైనుల యొక్క తీర్థయాత్రా ప్రదేశము గుజరాత్‌లోని భావ్‌నగర్ జిల్లాలో అతి పురాతన పట్టణం ‘పాలిటానా’. ఇక్కడికి అతి సమీపంలోని శత్రుంజయ పర్వతాలు జైనుల పంచక్షేత్రాలలో ఒకటి. ఈ ప్రాంతంలో మొత్తం 863 ఆలయాలు ఉండటం విశేషం. అన్నిట్లో ముఖ్యమైనది ఆదీశ్వరాలయం. పాలరాతితో నిర్మించిన ఈ ఆలయంలోని శిల్పాలు అత్యంత ఆకర్షణీయంగా ఉంటాయి. చాలా దేవాలయాలు ఇక్కడ జైన మందిరాలుగా మార్పు చెందాయి. 11వ శతాబ్దం నాటి ఇక్కడి ఆలయాల్లో శిల్ప నైపుణ్యం అద్భుతం. ఈ ప్రాంతంలో అనేక బౌద్ధ గుహలు కన్పిస్తాయి. అప్పట్లో జైన, బౌద్ధమతాలు గొప్పగా విరాజిల్లిన ప్రాంతం పాలిటానా.
Impressum