పొన్నూరు

Svenska 中文 Português Tiếng Việt English Italiano Bahasa Melayu

పొన్నూరు, గుంటూరుకు 31 కి.మీ. దక్షిణాన ఉన్న ఒక చారిత్రక పట్టణం.ఇది పురపాలకసంఘం హోదా కలిగిన పట్టణం.పొన్నూరు మండలానికి పరిపాలనా కేంద్రం. పిన్ కోడ్ నం. 522 124., ఎస్.టి.డి.కోడ్ = 08643.ఈ పట్టణం గుంటూరు, చీరాల రాష్ట్ర రహదారి పై ఉంది. చెన్నై-కోల్‌కతా రైలు మార్గం ఈ పట్టణం గుండా పోతుంది.పొన్నూరు ఒక శాసనసభ నియోజకవర్గ కేంద్రం. గుంటూరు జిల్లా లోని ముఖ్య పురపాలక సంఘాలలో ఒకటి. నిడుబ్రోలు పొన్నూరును ఆనుకుని ఉన్న ఒక ప్రముఖ గ్రామం. ఒకదానితో ఒకటి కలిసిపోయి ఒకే పట్టణం వలె అనిపిస్తాయి. రైల్వే స్టేషను నిడుబ్రోలు పేరిటే ఉంటుంది. అలాగే చుట్టుపక్కల ఉన్న ఎన్నో వ్యవసాయ ఆధారిత గ్రామాలకు పొన్నూరు కేంద్రంగా ఉంది.

WikipediaImpressum