Svenska हिन्दी 中文 Português Tiếng Việt English Bahasa Melayu Italiano
తాండూర్, తెలంగాణ రాష్ట్రంలోని వికారాబాదు జిల్లా, తాండూరు మండలానికి చెందిన గ్రామం. 2016 లో చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం పాత రంగారెడ్డి జిల్లా లోని ఇదే మండలంలో ఉండేది. ఇది హైదరాబాదుకు పశ్చిమాన 116 కిలోమీటర్ల దూరంలో రంగారెడ్డి జిల్లా పశ్చిమాన ఈ పట్టణం ఉంది.వికారాబాదు జిల్లాలో పశ్చిమాన ఉన్న ఈ పట్టణం వ్యవసాయపరంగా కందులకు, పారిశ్రామికపరంగా నాపరాళ్ళకు ప్రసిద్ధి.మూడవ గ్రేడు పురపాలకసంఘంచే పట్టణ పాలన నిర్వహించబడుతుంది. తాండూరుకు రాష్ట్ర రాజధాని హైదరాబాదు నుంచి రోడ్డు, రైలు పరంగా మంచి రవాణా సౌకర్యాలు ఉన్నాయి. రాజకీయంగా మాజీ ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి, మాజీ మంత్రులు ఎం.మాణిక్ రావు, ఎం.చంద్రశేఖర్ లాంటి ప్రముఖులు తాండూరు నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు. పట్టణం సమీపంలో పలు సిమెంటు కర్మాగారాలు ఉన్నాయి. పట్టణానికి తాగునీరు అందించే కాగ్నానది, దాని సమీపంలోనే వ్యవసాయ పరిశోధన కేంద్రం పట్టణానికి 4 కిలోమీటర్ల దూరాన ఉన్నాయి. షాబాద్ నాపరాయిగా ప్రసిద్ధి చెందిన తాండూరు ప్రాంతంలో లభ్యమయ్యే నాపరాతికి దేశవిదేశాలలో మంచి డిమాండు ఉంది. ఇక్కడ కందిపప్పుకు మంచి పేరు ఉంది.