సెయింట్ లూసియా

Suomi فارسی Tiếng Việt Galego Magyar Nederlands Slovenščina Српски / Srpski Norsk (Bokmål) Bahasa Melayu Português Română Français Euskara Català Lietuvių Svenska 日本語 Nynorsk Español Slovenčina 中文 Dansk ไทย Čeština Deutsch Italiano Hrvatski Українська Ελληνικά हिन्दी English Русский 한국어 Eesti Polski العربية Türkçe עברית

ద్వీపంలో కొత్త యురేపియన్ సెటలర్లలో ఫ్రెంచ్ ప్రథమస్థానంలో ఉంది.1660లో వారు స్థానిక కరీబియన్ ఇండియన్లతో ఒక ఒప్పందం మీద సంతకం చేసారు.1663-1667 వరకు ఇంగ్లాండ్ ద్వీపం మీద ఆధీనత సాధించింది. తరువాతి కాలంలో ఇక్కడ ఫ్రెంచి వారితో 14 మార్లు యుద్ధాలు సంభవించాయి. ద్వీపం పాలన తరచుగా ఇగ్లాండు, ఫ్రెంచి నడుమ మారుతూ వచ్చింది. ఇది 7 మార్లు ఇంగ్లాండు పాలనలో మరొక 7 మార్లు ఫ్రెంచి పాలనలో ఉంది.1814 లో బ్రిటన్ ద్వీపం మీద సంపూర్ణ అధికారం సాధించింది.వెస్టిండీస్ దీవులలో సెయింట్ లూసియా " హెలెన్ ఆఫ్ ట్రాయ్ " అని వర్ణించబడింది.1840లో ప్రతినిధుల పాలన మొదలైంది. 1953లో ఓటు హక్కు కల్పించబడింది.1958 నుండి 1962 వరకు ద్వీపం " వెస్ట్ ఇండీస్ ఫెడరేషన్ "లో భాగంగా ఉంది. 1979 ఫిబ్రవరిలో సెయింట్ లూసియా కామంవెల్త్ దేశాలలోని ఐక్యరాజ్యసమితి అనుసంధానిత స్వతంత్రదేశంగా మారింది. సెయింట్ లూసియాలో మిశ్రిత న్యాయవ్యవస్థ అమలులో ఉంది. సెయింటు లూసియా న్యాయవిధానం " సివిల్ లా , ఇంగ్లీష్ కామల్ లా " ఆధారితంగా ఉంటుంది. 1867 సెయింట్ లూసియా సివిల్ కోడ్ "1866 సివిల్ కోడ్ ఆఫ్ లోవర్ కెనడా " ఆధారితంగా ఉంటుంది. ఇది " లా ఫ్రాంకోఫొనీ "లో సభ్యదేశంగా ఉంది.

Wikipedia



Impressum