హవేరి

فارسی Tiếng Việt हिन्दी Español English Русский Français 中文 العربية Nederlands Deutsch Italiano Norsk (Bokmål)

హవేరి
Wikipedia

హవేరి, భారతదేశం, కర్ణాటక రాష్ట్రం, హవేరి జిల్లా లోని ఒక పట్టణం. ఇది హవేరి జిల్లా పరిపాలనా ప్రధాన కార్యాలయం. హావేరి ఏలకుల దండలు, బైడగి ఎర్ర మిరపకాయలకు ప్రసిద్ధి చెందింది. ఇక్కడికి 25 కి.మీ దూరంలో కవి కనకదాసు జన్మించిన బడా అనే ప్రదేశం ఉంది. హావేరి అనే పేరు కన్నడ పదాల హావు, కేరి నుండి వచ్చింది, దీని అర్థం పాముల ప్రదేశం. ఈ పట్టణఁం లోని హుక్కేరి మఠం ప్రసిద్ధి చెందిన మఠం. హవేరి బెంగళూరు నుండి రైలులో 7 గంటల సమయంలో ప్రయాణించే దూరంలో ఉంది. రోడ్డు మార్గంలో, బెంగళూరు నుండి జాతీయ రహదారి -48లో ముంబై వైపు 340 కి.మీ.దూరం ప్రయాణించాలి. ఇది పోర్ట్ సిటీ మంగళూరుకు ఉత్తరాన 307 కి.మీ దూరంలో ఉంది.
Impressum