నిర్మల్ జిల్లాలోని 2 శాసనసభ నియోజకవర్గాలలో నిర్మల్ శాసనసభ నియోజకవర్గం ఒకటి. మరో ఆరు శాసనసభ నియోజకవర్గాలతో కలిపి అదిలాబాదు లోక్‌సభ నియోజకవర్గంలో ఉన్న ఈ నియోజకవర్గం 1962 నుండి కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ అభ్యర్థులే విజయం సాధిస్తున్నారు. 1962 నుండి 6 సార్లు కాంగ్రెస్, కాంగ్రెస్ (ఐ) అభ్యర్థులు విజయం సాధించగా, 4 సార్లు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు గెలుపొందినారు. 2009 ఎన్నికలలో పొత్తులో భాగంగా మహాకూటమి తరఫున తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థి పోటీ పడుతున్నాడు.