ఇరాక్

Suomi فارسی Tiếng Việt Galego Magyar Nederlands Slovenščina Српски / Srpski Norsk (Bokmål) Bahasa Melayu Português Română Français Euskara Català Lietuvių Svenska 日本語 Nynorsk Español Slovenčina 中文 Dansk ไทย Čeština Deutsch Italiano Hrvatski Українська Ελληνικά हिन्दी English Русский 한국어 Eesti Polski العربية Türkçe עברית

ఇరాక్
Wikipedia

ఇరాక్ (ఆంగ్లం : Iraq), అధికారికనామం రిపబ్లిక్ ఆఫ్ ఇరాక్ (అరబ్బీ : جمهورية العراق ), జమ్-హూరియత్ అల్-ఇరాక్, పశ్చిమ ఆసియా లోని ఒక సార్వభౌమ దేశం. దీని రాజధాని బాగ్దాదు. దేశం ఉత్తర సరిహద్దులో, టర్కీ తూర్పు సరిహద్దులో ఇరాన్ (కుర్దిస్తాన్ ప్రాంతం), ఆగ్నేయ సరిహద్దులో కువైట్, దక్షిణ సరిహద్దులో సౌదీ అరేబియా, వాయవ్య సరిహద్దులో జోర్డాన్ పశ్చిమ సరిహద్దులో సిరియా దేశం ఉన్నాయి. ఇరాక్ దక్షిణ ప్రప్రాంతం అరేబియన్ ద్వీపకల్పంలో ఉంది. అతిపెద్ద నగరం, దేశరాజధాని అయిన బాగ్దాదు నగరం దేశం మద్యభాగంలో ఉంటుంది. ఇరాక్‌లో అధికంగా అరేబియన్లు, కుర్దీ ప్రజలు ఉన్నారు. తరువాత స్థానాలలో అస్సిరియన్, ఇరాకీ తుర్క్మెనీయులు, షబకీయులు, యజిదీలు, ఇరాకీ ఆర్మేనియన్లు, ఇరాకీ సిర్కాసియన్లు, కవ్లియాలు ఉన్నారు. ఇరాక్ లోని 36 మిలియన్ ప్రజలలో 95% సున్నీ ముస్లిములు ఉన్నారు.వీరుకాక దేశంలో క్రైస్తవం, యార్సన్, యజిదీయిజం, మండీనిజం కూడా ఆచరణలో ఉంది. ఇరాక్‌లో 58 కి.మీ. (36 మై.) పొడవైన సన్నని సముద్రతీర ప్రాంతం (పర్షియన్ గల్ఫ్ ఉత్తరంలో) ఉంది. ఈ ప్రాంతంలో సారవంతమైన టిగ్రిస్-యూఫ్రేట్స్ నదీ మైదానం ఉంది. ఇది జగ్రోస్ పర్వతశ్రేణికి వాయవ్యంలో సిరియన్ ఎడారికి తూర్పు భాగంలో ఉంది. ఇరాక్‌లోని రెండు ప్రధాన నదులైన టిగ్రిస్, యూఫ్రేట్స్ నదులు దక్షిణంగా ప్రవహించి షాట్ అల్ అరబ్ వైపు ప్రవహించి పర్షియన్ గల్ఫ్‌లో సంగమిస్తాయి. ఈ నదులు ఇరాక్‌కు సారవంతమైన వ్యవసాయ భూమిని అందిస్తున్నాయి. టిగ్రిస్-యూఫ్రేట్స్ నదీప్రాంతాలకు మెసపటోమియా అని చారిత్రక నామం ఉంది. ఇక్కడ ఇది తరచుగా మానవ నాగరికతా సోపానంగా వర్ణించబడుతుంది.మానవనాగరికతలో వ్రాయడం, చదవడం, చట్టం రూపకల్పన చక్కగా నిర్వహించబడిన ప్రభుత్వం పాలనలో నగరనిర్మాణం చేసి ప్రజలు నివసించారు.క్రీ.పూ 6 వ శతాబ్దం నుండి ఈ ప్రాంతంలో పలు నాగరికతలు నిరంతర మ్ఘాఆ విజయవంతంగా విలసిల్లాయి. ఇరాక్ అకాడియన్, నియో - సుమేరియన్ సామ్రాజ్యం, నియో అస్సిరియన్, నియో - బాబిలోనియన్ సామ్రాజ్యాలు విలసిలాయి. ఇరాక్ మెడియన్ సామ్రాజ్యం, అచమనిద్ అస్సిరియన్, సెల్యూసిడ్ సామ్రాజ్యం, అర్ససిద్ సామ్రాజ్యం, సస్సనిద్ సామ్రాజ్యం, రోమన్ సామ్రాజ్యం, రషిదున్ సామ్రాజ్యం, సఫావిద్ సామ్రాజ్యం, అఫ్షరిద్ రాజవంశ పాలన, ఓట్టమన్ సామ్రాజ్యాలలో భాగంగా ఉంది. అలాగే యునైటెడ్ కింగ్డం ఆధీనంలో కొంతకాలం ఉంది. 1920లో ఓట్టమన్ సామ్రాజ్యం విభజన తరువాత ఇరాక్ సరిహద్దులు సరికొత్తగా నిర్ణయించబడ్డాయి. 1921లో కింగ్డం ఆఫ్ ఇరాక్ సామ్రాజ్యం స్థాపించబడింది. 1932లో యునైటెడ్ కింగ్డం నుండి స్వతంత్రం లభించింది. 1958లో ఇరాక్ సామ్రాజ్యం విచ్ఛిన్నమై ఇరాక్ రిపబ్లిక్ స్థాపించబడింది. 1968 నుండి 2003 వరకు బాత్ పార్టీ ఇరాక్‌ను పాలించింది.2003 లో యునైటెడ్ స్టేట్స్ ఇరాక్‌ మీద దాడి చేసింది. సదాం హుస్సేన్ ప్రభుత్వం తొలగించబడి ఇరాక్‌లో పార్లమెంటు ఎన్నికలు నిర్వహించబడ్డాయి. 2011 నుండి ఇరాక్‌ నుండి అమెరికన్ దళాలు వైదొలగాయి. 2011-2013 వరకు ఇరాక్ విప్లవం కొనసాగింది. సిరియన్ అంతర్యుద్ధం ప్రభావం ఇరాక్ వరకు వ్యాపించింది..




Impressum