యెమన్

Suomi فارسی Tiếng Việt עברית Galego Magyar Nederlands 한국어 Slovenščina Српски / Srpski Norsk (Bokmål) Bahasa Melayu Português Română Français Català Svenska 日本語 Nynorsk Español Slovenčina Lietuvių Eesti 中文 Dansk ไทย Deutsch Euskara Italiano Hrvatski Ελληνικά हिन्दी Čeština English Русский Polski العربية Українська Türkçe

యెమన్ (i/ˈjɛmən/; అరబ్బీ: اليَمَن‎ al-Yaman),అధికారికంగా రిపబ్లిక్ ఆఫ్ యెమన్ అని పిలవబడుతుంది. (الجمهورية اليمنية al-Jumhūrīyah al-Yamanīyah), పశ్చిమాసియా లోని అరబ్ దేశాలలో ఇది ఒకటి. అరేబియా ద్వీపకల్పంలో దక్షిణతీరంలో ఉంది. 203,850 చ.కి.మీ వైశాల్యం కలిగిన యెమన్ అరేబియా ద్వీపకల్పంలో వైశాల్యపరంగా ద్వితీయస్థానంలో ఉంది.సముద్రతీరం పొడవు 2,000 కి.మీ. యేమన్ ఉత్తర సరిహద్దులో సౌదీ అరేబియా, పశ్చిమ సరిహద్దులో ఎర్రసముద్రం, దక్షిణ సరిహద్దులో గల్ఫ్ ఆఫ్ ఆడెన్ మరియు అరేబియన్ సముద్రం మరియు తూర్పు మరియు ఈశాన్య సరిహద్దులో ఒమన్ దేశం ఉన్నాయి.యెమన్ రాజ్యాంగ బద్ధంగా సనా నగరాన్ని రాజధానిగా నిర్ణయించినప్పటికీ 2015 ఫిబ్రవరి వరకు యెమన్ రాజధాని నగరం సనా తిరుగుబాటుదారుల ఆధీనంలో ఉంది. అందువలన యెమన్ రాజధాని తాత్కాలికంగా దక్షిణ తీరంలో ఉన్న" ఆడెన్ " నగరానికి మార్చబడింది. యెమన్ భూభాగంలో 200 ద్వీపాలు ఉన్నాయి. వీటిలో అత్యంత విశాలమైనది " సొకోటా " ద్వీపం.యెమన్ సబయాన్లకు నిలయంగా ఉంది (బైబుల్ పేరు షెబా) వాణిజ్యపరంగా వేయి సంవత్సరాలకు పైగా ప్రాధాన్యత కలిగిన యెమన్ దేశంలో ఆధునిక కాలానికి చెందిన ఎథియోపియా మరియు ఎరిత్రియా దేశాలు భాగంగా ఉన్నాయని భావిస్తున్నారు. క్రీ.శ. 275లో ఈ ప్రాంతం యెమనీ యూదుల పాలనలో తరువాత " హిమియారితే రాజ్యంలో " భాగంగా మారింది. యెమన్ ప్రాంతంలో 4వ శతాబ్ధంలో క్రైస్తవమతం ప్రవేశించింది. ముందుగా ఇక్కడ యూదిజం మరియు ప్రాంతీయంగా ఉన్న పాగనిజం ఉండేవి. 7వ శతాబ్ధం నాటికి ఈ ప్రాంతంలో ఇస్లాం వేగవంతంగా వ్యాపించింది. ఆరంభకాల ఇస్లాం యుద్ధాలలో యెమన్ బృందాలు ప్రధాన పాత్ర వహించాయి. యెమన్ రాజ్యాంగ వ్యవస్థ అత్యంత కాఠిన్యత కలిగినదిగా భావించబడుతుంది.

Wikipedia



Impressum