మచిలీపట్నం

Suomi فارسی Tiếng Việt Bahasa Melayu हिन्दी 日本語 Português Español English Русский 한국어 Français 中文 Polski Svenska العربية Nederlands Čeština Deutsch Українська Italiano Norsk (Bokmål) Català

మచిలీపట్నం
Wikipedia

మచిలీపట్నం (Machilipatnam) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లాకు చెందిన ముఖ్య తీర నగరం. పిన్ కోడ్: 521001. దీనిని బందరు లేదా మసూలిపటం లేదా మసూల అని కూడా పిలుస్తారు. ఈ పట్టణానికి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో ప్రత్యేక పురపాలక సంఘ స్థాయి కల్పించబడింది. ఈ పట్టణం చరిత్ర 3 వ శతాబ్దం శాతవాహనుల కాలములో నుండి ఉన్నదని దానిని మైసలోస్ (టోలిమి) మసిలా (పెరిప్లస్) అని పిలిచేవారని తెలుస్తున్నది.. తీరపట్టణం అవడం చేత 17 వ శతాబ్దములో బ్రిటీష్ వారు, ఫ్రెంచ్ వారు డచ్|డచ్ వారు ఇక్కడ నుండి వర్తకం జరిపేవారు. 350 పడవలు పట్టే సన్నకారు చేపల రేవు ఉంది. ఈ పట్టణం కలంకారీ అద్దకం పనికి (కూరగాయల నుండి తీసిన రంగుల), తివాచీలకు, బందరు లడ్డు లకి ప్రసిద్ధి. ఒంగోలు, మచిలీపట్నం మధ్య నున్న తీర ప్రాంతం తరచు తుఫాను, వరదల బారిన పడుతుంటుంది. బియ్యము, నూనె గింజలు, బంగారపు పూత నగలు, వైజ్ఞానిక పరికరాలు ఇక్కడి ఇతర ఉత్పత్తులు. మచిలీపట్టణం నుంచి విశాఖపట్టణం, బీదర్, ధర్మవరం,విజయవాడ, గుంటూరు ప్రాంతాలకు ప్రతి రోజూ రైళ్ళు, బస్సులు ఉన్నాయి. వర్షాకాలంలో ఈ ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడతారు.
Impressum