ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ మద్రాస్‌

Français हिन्दी Português فارسی Deutsch English Norsk (Bokmål)

ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ మద్రాస్‌
Wikipedia

ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టక్నాలజీ మద్రాస్‌ (ఐఐటీ మద్రాస్‌) దక్షిణ భారత దేశంలోని చెన్నైలో ఉన్న ఒక విశ్వవిద్యాలయ హోదాగల ఇంజినీరింగ్‌ , టెక్నాలజీ విద్యాసంస్థ. ఇది భారత ప్రభుత్వం చేత, జాతీయ ప్రాముఖ్యత గల సంస్థగా గుర్తింపు పొందింది. ఇది భారతదేశంలోని అత్యుత్తమ ఇంజినీరింగ్‌ విద్యాలయాలలో ఒకటి. ఈ సంస్థను 1959లో పశ్చిమ జర్మనీ ప్రభుత్వపు సాంకేతిక , ఆర్థిక సహకారంతో ఏర్పాటు చేశారు. భారత దేశపు పార్లమెంటు యొక్క చట్టం ద్వారా రూపుదాల్చిన పదిహేను ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ లలో ఐఐటీ మద్రాస్‌ మూడోది. 2015 లో టైమ్స్ విడుదల చేసిన యూనివర్సిటీ ర్యాంకింగ్ లలో ఆసియాలో ఐఐటి మద్రాసు 78 స్థానంలో నిలిచినది
Impressum