ధోలావీరా

Suomi Tiếng Việt Lietuvių हिन्दी 日本語 Deutsch Español English Русский Français Nederlands

ధోలావీరా
Wikipedia

ధోలావీరా గుజరాత్ లోని కచ్ జిల్లా, భచావ్ తాలూకా, ఖదిర్‌బెట్ వద్ద ఉన్న పురావస్తు క్షేత్రం. ఈ స్థలానికి 1 కిలోమీటరు దక్షిణంగా ఉన్న ధోలావీరా అనే గ్రామం పేరిట ఈ పేరు వచ్చింది. ఈ గ్రామం రాధన్‌పుర్ నుండి 165 కి.మీ. దూరంలో ఉంది. స్థానికంగా కోటాడ టింబా అని కూడా పిలిచే ఈ స్థలంలో సింధు లోయ నాగరికతకు చెందిన పట్టణ శిథిలాలు ఉన్నాయి. ఈ స్థలం కర్కట రేఖపై ఉంది. హరప్పా క్షేత్రాల్లోని ఐదు పెద్ద వాటిలో ఇది ఒకటి. భారత్‌లో సింధు లోయ నాగరికతకు చెందిన ప్రముఖ స్థలాల్లో ఒకటి. దీన్ని, సమకాలీన పట్టణాల్లోకెల్లా అత్యంత ఘనమైనదిగా భావిస్తారు. ఇది రాన్ ఆఫ్ కచ్‌లోని కచ్ ఎడారి వన్యప్రాణి సంరక్షణాలయంలోని ఖదిర్బెట్ దీవిలో ఉంది. 48 హెక్టార్ల చతుర్భుజాకారపు ఈ పట్టణం, ఉత్తరాన మన్‌సార్, దక్షిణాన మన్‌హర్ అనే రెండు వాగుల మధ్య నెలకొని ఉంది. ఈ స్థలంలో సా.పూ 2650 నుండి జనావాసాలు ఉన్నాయి. సా.పూ. 2100 నుండి క్షీణించడం మొదలై, కొన్నాళ్లపాటు పూర్తిగా నిర్జనమైపోయి, తిరిగి సా.పూ. 1450 లో జనావాసాలు మొదలయ్యాయి.
Impressum