Français हिन्दी Español English
కాసు బ్రహ్మానందరెడ్డి జాతీయ వనం (ఆంగ్లం:Kasu Brahmananda Reddy National Park), హైదరాబాదు నగరంలో బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ ప్రాంతంలో ఉంది. ఇది ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానంద రెడ్డి పేరు మీద నామకరణం చేయబడింది. ఇది సుమారు 1.4 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించి చుట్టూ బహుళ అంతస్తుల భవనాల మధ్య నందనవనం లాగా ఉంటుంది. ఈ ప్రాంతంలో కాలుష్య నియంత్రణలో ఈ వనం ప్రముఖ పాత్ర వహిస్తుంది.