ఎరిత్రియా

Suomi فارسی Tiếng Việt עברית Galego Lietuvių Magyar Nederlands 한국어 Slovenščina Српски / Srpski Norsk (Bokmål) Bahasa Melayu Português Română Français Euskara Català Svenska 日本語 Nynorsk Español Slovenčina Eesti 中文 Dansk ไทย Deutsch Italiano Hrvatski Ελληνικά हिन्दी English Русский Polski Čeština العربية Українська Türkçe

ఎరిట్రియా లేదా ఎరిత్రియా (ఆంగ్లం : Eritrea), (అరబ్బీ : إرتريا ఇరిత్రియా), అధికారిక నామం ఎరిట్రియా రాజ్యం ఈశాన్య ఆఫ్రికా(హార్ను ఆఫ్ ఆఫ్రికా) లోని ఒక దేశం. దేశ పశ్చిమసరిహద్దులో సూడాన్, దక్షిణసరిహద్దులో ఇథియోపియా, ఆగ్నేయసరిహద్దులో జిబౌటి దేశాలు ఉన్నాయి. దీని తూర్పున మరియు ఈశాన్యసరిహద్దులో ఎర్ర సముద్రపు పొడుగైన తీరం ఉంది. దేశవైశాల్యం 1,18,000 చ.కి.మీ. జనసంఖ్య 50 లక్షలు గలదు. దీని రాజధాని అస్మారా. దేశంలో దాహ్లాకు ద్వీపసమూహం, అనేక హనిషు దీవులు భాగంగా ఉన్నాయి. గ్రీకుపేరు ఎరిట్రియా ఎర్ర సముద్రం (Ἐρυθρὰ Θάλασσα ఎరిథ్రా తలాస్సా) ఆధారంగా దేశానికి నిర్ణయించబడిందని భావిస్తున్నారు. 1890 లో మొదటిసారిగా ఇటలీ ఎరిత్రియా నుండి ఇటలీని స్వీకరించి ఇటలీ దేశానికి నిర్ణయించబడింది.

Wikipedia



Impressum