మహాబలిపురం

Suomi فارسی Tiếng Việt Lietuvių Bahasa Melayu हिन्दी 日本語 Nynorsk Español Slovenčina English Русский 한국어 Français 中文 Українська Norsk (Bokmål) Polski Magyar Nederlands Čeština Deutsch Euskara Italiano Hrvatski Català Српски / Srpski Svenska

మహాబలిపురం
Wikipedia

మహాబలిపురం, దీనిని మామల్లపురం అని కూడా పిలుస్తారు. ఇది ఆగ్నేయ భారతదేశం, తమిళనాడు రాష్ట్రంలోని చెంగల్పట్టు జిల్లా లోని ఒక పట్టణం. ఇది కంచి పట్టణానికి 66 కి.మీ. దూరంలో, రాష్ట్ర రాజధాని చెన్నైకి 70 కి.మీ. దూరంలో ఉంది. ఈ పట్టణంలో ఉన్న తీరం వెంబడి ఉన్న దేవాలయం ప్రపంచంలో యునెస్కో వారి చేత సంరక్షించ బడుతున్న హెరిటేజ్ ప్రదేశాలలో ఒకటి.ఇది మహాబలిపురంలోని 7వ , 8వ శతాబ్దాల హిందూ సమూహ స్మారక కట్టడాల యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా ప్రసిద్ధి చెందింది. భారతదేశంలోని ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాలలో ఇది ఒకటి. ఈ ప్రదేశం పురాతన పేరు తిరుకడల్మలై. పల్లవ రాజ్యంలో రెండు ప్రధాన ఓడరేవు నగరాల్లో మామల్లపురం ఒకటి. ఈ పట్టణానికి పల్లవ రాజు నరసింహవర్మన్ I పేరు పెట్టారు, ఇతనను మామల్ల అని కూడా పిలుస్తారు. ఆర్థిక శ్రేయస్సుతో పాటు, ఇది రాచరిక స్మారక కట్టడాల సమూహంగా మారింది, చాలా వరకు సజీవ శిల్పాలుగా చెక్కబడ్డాయి.




Impressum