లార్డ్స్ క్రికెట్ స్టేడియం

فارسی Lietuvių Українська Ελληνικά Svenska हिन्दी 日本語 Српски / Srpski Español English Русский 한국어 Français 中文 Polski Dansk Nederlands Čeština Deutsch Italiano Norsk (Bokmål) Türkçe עברית

లార్డ్స్ క్రికెట్ స్టేడియం
Wikipedia

లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్, లండన్ సెయింట్ జాన్స్ వుడ్‌లోని క్రికెట్ మైదానం. దీన్ని సాధారణంగా లార్డ్స్ అని పిలుస్తారు. దాని వ్యవస్థాపకుడు, థామస్ లార్డ్ పేరు దీనికి పెట్టారు. ఇది మేరీల్‌బోన్ క్రికెట్ క్లబ్ (ఎమ్‌సిసి) యాజమాన్యంలో ఉంది. మిడిల్‌సెక్స్ కౌంటీ క్రికెట్ క్లబ్, ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డ్ (ECB), యూరోపియన్ క్రికెట్ కౌన్సిల్ (ECC), 2005 ఆగస్టు వరకు ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ICC) లకు ఇది నిలయం. లార్డ్స్‌ను క్రికెట్‌కు నిలయంగా పిలుస్తారు. ఇక్కడ, ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన క్రీడా మ్యూజియం ఉంది.




Impressum