తడ

Français English

తడ
Wikipedia

తడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తిరుపతి జిల్లా, తడ మండలం లోని గ్రామం. ఇది మండల కేంద్రం. ఇది సమీప పట్టణమైన చెన్నై నుండి 66 కి. మీ. దూరంలో ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 1068 ఇళ్లతో, 4220 జనాభాతో 377 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 2206, ఆడవారి సంఖ్య 2014. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 999 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 127. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 592782.పిన్ కోడ్: 524401. ఈ ఊరు చెన్నై-నెల్లూరు జాతీయ రహదారిలో చెన్నైనుండి 85 కి.మీ. దూరంలో ఉంది. తమిళనాడు - ఆంధ్ర ప్రదేశ్ సరిహద్దు ఈ వూరినుండి 1.5 కి.మీ. దూరంలో ఉంటుంది. ఇక్కడికి సమీప రైల్వే స్టేషను సూళ్ళూరుపేట. తడకు సమీపంలో వరదయ్యపాలెం వద్ద "ఉబ్బలమడుగు" అనే చోట ఒక జలపాతం ఉంది. ఈ చుట్టుప్రక్కల అడవి ప్రదేశం, ట్రెక్కింగ్‌కు అనువైన దారి, జలపాతం ప్రకృతి ప్రేమికులను అలరిస్తాయి.
Impressum