కలహంది జిల్లా

Русский Français English 中文 Norsk (Bokmål) Deutsch Italiano Svenska العربية Suomi Nederlands हिन्दी తెలుగు Español

ఒడిషా రాష్ట్ర 30 జిల్లాలలో కలాహండి జిల్లా (ఒడిషా:କଳାହାଣ୍ଡି) ఒకటి. పురాతన కాలంలో ఈ ప్రాంతం సుందరమైన మరియు గొప్ప సాంస్కృతిక వైభవం కలిగి ఉంది. ఈ ప్రాతంలో పురాతత్వ త్రవ్వకాలలో రాతియుగం మరియు ఇనుప యుగానికి చెందిన మానవ ఆవాసాలకు చెందిన ఆధారాలు లభించాయి. ఈప్రాంతంలోని అసురగర్ 2000 సంవత్సరాలకు ముందునాటి నగరప్రాంతానికి చెందిన మానవ ఆవాసాల ఆధారాలు లభించాయి. ఆసియాలో వరిపంట పండిచిన ప్రాతాలలో కలాహండి మరియు కోరాపుట్ ప్రాంతాలు మొదటివని విశ్వసించబడుతుంది. పురాతన కాలంలో ఈ ప్రాంతాన్ని " మహాకాంతారా " (గొప్ప అరణ్యం) మరియు కరుంద మండలం ( అని పిలిచేవారు. కురందం అంటే కురందం లేక మాణిక్యం, కెంపు (గార్నెట్), బెరుజ్, నీలం మరియు అలెగ్జాండ్రా మొదలైన విలువైన రాళ్ళు లభించే ప్రాంతం అని అర్ధం. బ్రిటిష్ ఇండియాలో ఈ ప్రాంతం రాజసంస్థానంగా ఉంది. స్వతంత్రం తరువాత కలాహండి ప్రాతం (ప్రస్తుత నౌపద జిల్లా ప్రాంతంతో కలిపి) ఒడిషాలో కలుపబడింది. 1967లో కలాహండి జిల్లాలోని కాశీపూర్ బ్లాకు పరిపాలనా సౌలభ్యంకొరకు రాయగడ జిల్లాలో కలుపబడింది. 1980లో కలాహండి జిల్లా వెనుకబడిన జిల్లా మరియు కరువుకాటకాలకు మరియు ఆకలి మరణాలకు కేంద్రంగా గుర్తించబడింది. దీనిని " కలాహండి సిండ్రోం "గా పిలిచారు. గతంలో కలాహండి ప్రాంతం సంపన్నతకు చిహ్నంగా ఉండేది. చరిత్రలో ఈ ప్రాంతం వ్యవసాయం, అరణ్యం సంపద, రత్నాలు, బాక్సైట్, జానపద నృత్యాలు, జానపద సంగీతం, ఫోల్క్‌లోర్, హద్థకళలు మరియు కళలకు ప్రతీకగా ఉండేది. 1993 నౌపద ఉపవిభాగం జిల్లాగా రూపొందించబడింది. ప్రస్తుత కలాహండి పార్లమెంటు నియోజక వర్గంలో కహంది మరియు నౌపద జిల్లాలు భాగంగా ఉన్నాయి.

Rayagada నబరంగ్పుర్ Balangir నౌపద కొండమాల్ కొరాపుట్ Baudh గజపతి జిల్లా సుబర్నపూర్ రాయ్‌పూర్


Impressum