యెమన్


Ελληνικά English 中文 Tiếng Việt Català Italiano Euskara العربية Čeština Eesti Galego Español Русский Nederlands Português Norsk (Bokmål) Türkçe Lietuvių ไทย Română Polski Français Bahasa Melayu Hrvatski Deutsch Magyar فارسی हिन्दी Suomi Dansk 日本語 עברית తెలుగు Nynorsk Српски / Srpski 한국어 Svenska Slovenčina Українська Slovenščina

యెమన్ (i/ˈjɛmən/; అరబ్బీ: اليَمَن‎ al-Yaman),అధికారికంగా రిపబ్లిక్ ఆఫ్ యెమన్ అని పిలవబడుతుంది. (الجمهورية اليمنية al-Jumhūrīyah al-Yamanīyah), పశ్చిమాసియా లోని అరబ్ దేశాలలో ఇది ఒకటి. అరేబియా ద్వీపకల్పంలో దక్షిణతీరంలో ఉంది. 203,850 చ.కి.మీ వైశాల్యం కలిగిన యెమన్ అరేబియా ద్వీపకల్పంలో వైశాల్యపరంగా ద్వితీయస్థానంలో ఉంది.సముద్రతీరం పొడవు 2,000 కి.మీ. యేమన్ ఉత్తర సరిహద్దులో సౌదీ అరేబియా, పశ్చిమ సరిహద్దులో ఎర్రసముద్రం, దక్షిణ సరిహద్దులో గల్ఫ్ ఆఫ్ ఆడెన్ మరియు అరేబియన్ సముద్రం మరియు తూర్పు మరియు ఈశాన్య సరిహద్దులో ఒమన్ దేశం ఉన్నాయి.యెమన్ రాజ్యాంగ బద్ధంగా సనా నగరాన్ని రాజధానిగా నిర్ణయించినప్పటికీ 2015 ఫిబ్రవరి వరకు యెమన్ రాజధాని నగరం సనా తిరుగుబాటుదారుల ఆధీనంలో ఉంది. అందువలన యెమన్ రాజధాని తాత్కాలికంగా దక్షిణ తీరంలో ఉన్న" ఆడెన్ " నగరానికి మార్చబడింది. యెమన్ భూభాగంలో 200 ద్వీపాలు ఉన్నాయి. వీటిలో అత్యంత విశాలమైనది " సొకోటా " ద్వీపం.యెమన్ సబయాన్లకు నిలయంగా ఉంది (బైబుల్ పేరు షెబా) వాణిజ్యపరంగా వేయి సంవత్సరాలకు పైగా ప్రాధాన్యత కలిగిన యెమన్ దేశంలో ఆధునిక కాలానికి చెందిన ఎథియోపియా మరియు ఎరిత్రియా దేశాలు భాగంగా ఉన్నాయని భావిస్తున్నారు. క్రీ.శ. 275లో ఈ ప్రాంతం యెమనీ యూదుల పాలనలో తరువాత " హిమియారితే రాజ్యంలో " భాగంగా మారింది. యెమన్ ప్రాంతంలో 4వ శతాబ్ధంలో క్రైస్తవమతం ప్రవేశించింది. ముందుగా ఇక్కడ యూదిజం మరియు ప్రాంతీయంగా ఉన్న పాగనిజం ఉండేవి. 7వ శతాబ్ధం నాటికి ఈ ప్రాంతంలో ఇస్లాం వేగవంతంగా వ్యాపించింది. ఆరంభకాల ఇస్లాం యుద్ధాలలో యెమన్ బృందాలు ప్రధాన పాత్ర వహించాయి. యెమన్ రాజ్యాంగ వ్యవస్థ అత్యంత కాఠిన్యత కలిగినదిగా భావించబడుతుంది.

ఎరిత్రియా జిబౌటి ఇథియోపియా సౌదీ అరేబియా సొమాలియా సూడాన్ బహ్రయిన్ కతర్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దక్షిణ సూడాన్ కువైట్ ఒమన్ ఈజిప్టు జోర్డాన్ ఉగాండా ఇజ్రాయిల్ الأراضي الفلسطينية ఇరాక్ లెబనాన్ సిరియా ఇరాన్ ఆక్రొతిరి మరియు ఢెకెలియా సైప్రస్ రువాండా బురుండి చాద్ సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ టాంజానియా అజర్‌బైజాన్ టర్కీ


Impressum